Facts About Hyderabad Metro Rail Project :


దేశంలో ఏ కట్టడానికీ దక్కని అవకాశం దక్కించుకుంది హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్. హైటెక్నాలజీకి ప్రత్యేక గుర్తింపొచ్చింది. ట్రైన్ ఇంజనీరింగ్ ప్లాన్ పై ’నేషనల్ జియోగ్రఫీ ఛానల్’ లో స్పెషల్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయింది. ట్రైన్ స్పెషాలిటీస్ గురించి ప్రత్యేకంగా చెప్పింది నేషనల్ జియోగ్రాఫిక్ చానల్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు వస్తున్న మెట్రో రైలు సాదాసీదాగా రెడీ కావడం లేదు. లోకల్ గా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న మెట్రో టెక్నాలజీ, ప్లానింగ్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపొచ్చింది. మహా మహా కట్టడాలకే చాన్సిచ్చే… నేషనల్ జియోగ్రఫీ చానల్ లోని అద్భుత కట్టడాల ఎపిసోడ్ లో మెట్రో ట్రైన్ కి ప్లేస్ దక్కింది. అద్భుతమైన టెక్నాలజీ. పర్ ఫెక్ట్ ప్లానింగ్. అందరికీ సాధ్యం కాని బడ్జెట్. జెట్ స్పీడ్ తో వెళ్తోన్న పనులు. ట్రైన్ ట్రాక్ పొడవు, దానికి అనుసంధానంగా రెడీ కానున్న వాకర్స్. ఇలా అన్నింటినీ పూస గుచ్చినట్లు వివరించింది నేషనల్ జియోగ్రఫిక్ చానల్. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ లో రెడీ అవుతోన్న మెట్రో ట్రైన్ కు కూడా… వాల్డ్ వైడ్ గా గుర్తింపొచ్చింది. మెట్రో స్టేషన్లు. అక్కడ ఉండే సదుపాయాలు. బోగీల ప్రత్యేకత. వాటిల్లో ఉండే ఫెసిలిటీస్. ప్రయాణీకుల భద్రత. లేటెస్ట్ టెక్నాలజీతో అందరికీ ఈజీగా ఉండేలా ప్లానింగ్. ఇలా అన్నింటికీ హైటెక్నాలజీ వాడుతోంది ప్రాజెక్ట్ యాజమాన్యం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని డెవలప్ మెంట్ ను అందరికీ తెలియజేసింది. NGCలో టెలికాస్టైన ఫస్ట్ ఎవర్ ఇండియన్ బెస్ట్ ఇంజనీరింగ్ కన్ స్ట్రక్షన్ మెట్రో ప్రాజెక్టే.

Share this

Related Posts

Previous
Next Post »