ఐఫోన్ జేబులో పెట్టుకున్నారా.. జరాభద్రం!
ప్యాంటు జేబులో ఐఫోన్ పెట్టుకొని దర్జాగా ఉందామని అనుకునేవారు కాస్త జాగ్రత్తగా ఉండండి. టపాకాయలు తుస్ మంటున్నా.. ఐఫోన్లు మాత్రం టాప్ అని పేలుతున్నాయి. ఐఫోన్లు కూడా పెలుతాయా అని ఆశ్చర్యపోకండి..విధిబాగాలేకపోతే.. పేలవచ్చు కూడా.. ఇక వివరాలలోకి వెళ్తే..
ఫ్యాంటు జేబులో పెట్టుకున్న ఐఫోన్ ఒక్కసారిగా పేలడంతో అమెరికాలో ఎనిమిదో తరగతి చదివే ఓ అమ్మాయి తీవ్రంగా గాయపడింది. మైనే ప్రాంతంలోని కెన్నెబంక్స్ మిడిల్ స్కూల్ లో ఈ ఘటన జరిగింది. బాలిక క్లాస్ రూంలో ఉన్న సమయంలోనే ఈ సంఘటన జరిగింది. ఐఫోన్ పేలి తొడకు గాయాలు కావడమే కాకుండా.. ఫ్యాంటు మొత్తం కాలిపోయింది.. స్కూల్ లో ప్రాధమిక చికిత్స అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు.