తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడింది. ఆ ఘనత తమ పార్టీ అధ్యక్షురాలు సోనియ తల్లిదే నంటూ ఢంకా బకాయించి మరీ చెప్పాడు అప్పటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకరన్న. సోనియా త్యాగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని అందుకు సోనియా తల్లింటూ కీర్తించాడు. ఆమె విగ్రహాం ఏర్పాటు చేస్తానని శంకరన్న మీడియా ముందు మీరీ ఓ రేంజ్ లో చెప్పాడు. అందుకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని డిమాండ్ చేశాడు. ఓ వేళ ప్రభుత్వం కేటాయించకుంటే... తానే తన సొంత వ్యవసాయ క్షేత్రంలో సోనియా తల్లి విగ్రహాం ఏర్పాటు చేస్తానని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు.
సోనియా తల్లి విగ్రహాన్ని సొంత ఖర్చులతో విజయవాడ సమీపంలో తయారు చేయించాడు కూడా. ఆ విగ్రహాం తయారవుతున్న దశలో శంకరన్న కుటుంబ సభ్యులతో కలసి సోనియా విగ్రహం తయారీని మరీ పరిశీలించి వచ్చారు. ఇంతలో ఎన్నికలు రానే వచ్చాయి. కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ జాబితా విడుదల చేసింది. ఆ జాబితాలో ఈ వీర విథేయుడైన శంకరన్నకు మాత్రం చోటు దక్కలేదు. దాంతో శంకరన్నకు కోపం కట్టలు తెంచుకుని... తన్నుకొచ్చింది.
అధిష్టాన దేవత సోనియాను తెలంగాణలోని నాయకులు ఎవరు కీర్తించని విధంగా బోళా శంకరుడిలా కీర్తించిన తనకు న్యాయం జరగలేదని శంకరన్న లోలోన ఫీలైపోయాడు. అంతే అభ్యర్థుల జాబితాలో తనకు చోటు లేనిపప్పుడు... తన వ్యవసాయ క్షేత్రంలో సోనియా తల్లికి చోటు లేదని భావించినట్లు ఉన్నాడు. అంతే సోనియా తల్లి గుడి సోదిలో లేకుండా పోయింది. కనీసం మళ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి ఈ గుడి గుర్తుకు వస్తుందేమో చూడాలి.
Article Courtesy : hey telangana
Article Courtesy : hey telangana