ఎలెక్షన్లు అయిపోయినాయి , ఇన్గా అందరూ సల్లగా ఇండ్లల పండుకున్నారు, కానీ గా గవర్నర్ మాత్రము తెలంగాణ కి చేయాల్సిన నష్టాన్ని చేస్తూనే వుంటాడు.
మెల్కొండి మిత్రులారా మన ఖమ్మం మనం కాపాడుకుందాం, తెలంగాణ పునర్విభజన బిల్లు లో ముంపు గ్రామాలని మాత్రమే సీమాంధ్ర కి బదలయిస్తా అని చెప్పారు కానీ బిల్లు లోకసభ లో ఆమోదం పొందిన తరువాత మన నక్కజిత్తుల వెంకయ్య నాయుడు కొర్రీ వల్లన మొత్తం 7 మండలాలు సీమాంధ్ర కలుపుతామని దానికోసం తక్షణం "ఆర్డినెన్స్" తీసుకోస్తా అన్నారు, కానీ ఇ లోపే ఎలెక్షన్లు రావడంతో రాష్టపతి ఒప్పుకోకపోవడంతో "ఆర్డినెన్స్" అక్కడే ఆగిపోయింది.
కానీ ఇప్పుడు మొన్న పోలవరం ప్రాజెక్టు అథారిటి ప్రకటించిన తరువాత ఇప్పుడు మళ్ళీ వారి దృష్టి 7 మండలాల బదలాయింపు పై పడింది, జూన్ 2 తరువాత ఈ 7 మండలాల బదలాయింపు చేయాలంటే తప్పకుండ తెలంగాణ రాష్ట్ర శాసనసభ తీర్మానం అవసరం, అది జరిగేపని కాదు కాబట్టి ఇప్పటి ఉమ్మడి రాష్ట్రం లోనే ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా ల కి బదలాయించలంటే ప్రబుత్వమ్ ఒకే ఒక G.O ద్వారా చేయడం సులభం, ప్రస్తుతం ప్రజా పాలన లేదు కాబట్టీ, రాష్ట్ర పతి పాలన పేరు తో పాలన చేసే గవర్నర్ గారి చే రేపు సీమాంధ్ర లో ఎలెక్షన్లు ముగియగానే G.O ద్వారా 7 మండలాలని బదలాయించాలని కేంద్ర ఆలోచిస్తుంది. దేన్ని వల్ల మనకు గోదావరి పై హక్కు ని కోల్పోవడమే కాక 485 MW పవర్ ఉత్పత్తి చేసే "దిగువ సీలేరు " విద్యుతు ఉత్పత్తి కేంద్రం కోల్పోతామ్ , అసలే విద్యుత్ కొరత వుండే తెలంగాణ రాష్ట్రనికి ఇంత పెద్ద ప్రాజెక్టు కోల్పోవడం పెద్ద దెబ్బ. అన్నిటికి కన్నా 2 లక్షల ఆదివాసీ లను పోలవరం ముంపు లో ముంచేస్తారు, కొండ రెడ్ల జాతి అంతరించి పోతుంది, పాపికొండలు అందాలు కనుమరుగై పోతాయి, సీలేరు నది కూడా కనుమర్గై పోతుంది. యెన్నో సహజ వనరులున్న ప్రాంతాన్ని సీమాండ్రుల అభివృద్ది పేరు తో నాశనం చేస్తారు. ఇందుకోసమేన మనం తెలంగాణ సాదించింది? , మనం ఇంట్లో మనం బాగుంటే చాలా, 2 లక్షల ఆదివాసులు యెమై పోయిన మంకెందుకులే అని కూర్చుందామా?, ఇదేనా మన పోరాట స్పూర్తి. ఇప్పటికే ఆంక్షలతో కూడిన హైదరాబాద్ ని ఇచ్చారు , ఇంకా ఇప్పుడు మన తెలంగాణ కు గర్వ కారణమైన ఆదివాసీ లను, వారి సంస్కృతి, సాంప్రదాయాలను కూడా కోల్పోవలా, రండి పోరాడుదాం, మన ఆదివాసీ అన్నల పోరాటానికి సంఘీభవాన్ని తెలుపుదమ్, వారికి కొండంత అండగా నిలుద్దాం. వారికి అస్తిత్వాన్ని ప్రసాదిద్దాం