ఇంకా తెలంగాణ అధికారికంగా ఏర్పాటు కాలేదు... ఆంధ్రా పార్టీలకు ఓటేస్తే తెలంగాణ ఏర్పడకముందే మళ్లా విలీనం చేసినా ఆశ్చర్యం లేదు...
గత అనుభవాలను గుర్తుచేసుకోండి..
ఏప్రిల్ 30వ తేడీ సాయంత్రం 6 గంటలకు తెలంగాణలో పోలింగ్ ముగుస్తుంది...
ఇక అప్పుడే సీమాంధ్రలో నరేంద్ర మోడీ సభ మొదలవుతోంది....
తిరుపతి వెంకన్న సాక్షిగా మన మోడీగారు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుతో భరత మాత కన్నీళ్లు పెట్టుకుందని...
తల్లిని చంపారు.. బిడ్డను బతికించారు అని అంటాడు...
ఇంకా అనేకం అంటాడు...
పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తాను.. బీహార్‌లో నితీశ్ కుమార్ ఇవ్వమంటున్నా కూడా ఇవ్వకుండా సీమాంధ్రకే ఇస్తాను అంటాడు...... మీరు కోరుకుంటే హైదరాబాద్‌లో సీమాంధ్రుల కోసం రాజ్యాంగ సవరణ చేస్తానని హామీ ఇస్తాడు..
మీకు ఆదాయం సరిపోకపోతే హైదరాబాద్ ఆదాయాన్ని పంచుతానని కూడా హామీ ఇవ్వొచ్చు..
25 ఏళ్లు హైదరాబాద్‌ను ఉమ్మడిని చేయిస్తానని కూడా అంటాడు....
ఒక్క నరేంద్ర మోడీయే కాదు.. వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు, జగన్ బాబు, కిరణ్ బాబు అందరు బాబులు కలిసి ఇంకా తెలంగాణ
అపాయింటెడ్ డే రాలేదు... మనం అంతా కలిస్తే దాన్ని కూడా ఆపొచ్చని అంటారు....
తెలంగాణ రాష్ట్రం ఇంకా ఏర్పాటు కాలేదు... దయచేసి సంపూర్ణ తెలంగాణ రావాలంటే ఈ ఆంధ్రా పెత్తనంలో ఉండే పార్టీలను తెలంగాణలో భూస్థాపితం చేయాలి...
ఓటేశాక బాధపడితే లాభం ఉండదు.... దయ చేసి ముందే జాగృతం కావాలి.... ఇప్పటికే అనేకసార్లు మోసపోయాం... ఈసారి మోసపోతే మనల్ని
ఆ దేవుడు కూడా రక్షించలేడు....
మిత్రులు అలోచించి మీ అమూల్యమైన ఓటు వెయ్యండి.